కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : పెంచికల్ పేట్ మండల కేంద్రం లో పలు సీసీ రోడ్డు నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్ భూమి పూజ చేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎవరు చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ చేపడుతున్నారని గ్రామ ప్రజలు కొనియాడారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పెంచికాల్ పేట్ మండల కేంద్రం లో 45 లక్షల సీసీ రోడ్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ బ్యాలేసింగ్ వర్క్ 8 లక్షలు, దర్గాపల్లి లో 10 లక్షలు, చేడువాయిలో లో 10 లక్షలు, గొంట్లపేట పోతేపల్లి లో 15 లక్షల రూపాయలతో నిర్మించబడే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని గ్రామాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రానున్న రోజుల్లో ప్రతి గ్రామాలకు మూల మూలన సిసి రోడ్ వేయించే బాధ్యత మన కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మిగతా గ్రామాల్లో త్వరలోనే నూతన సీసీ రోడ్ల పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ దండే విఠల్ తెలియజేశారు.
