తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతుంది. అలాగే దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేస్తుంది. భారత్ ఆకలి రాజ్యాంగ మారుతుంది. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేస్తుంది. నేను 45 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్నాను. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. దుబ్బాక (Dubbaka), హుజురాబాద్ (Hujurabad) లో మేం ఓడిపోయాం. నాగార్జున సాగర్, హుజూర్ నగర్ లో మేము గెలిచాం. నేను ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్నాను. మునుగోడులో సిగ్గుపడే పరిస్థితి. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (Palvai Sravanti) నన్ను కలిసినట్టు దుష్ప్రచారం చేశారు. ఎన్నికల కమీషన్ విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది. దేశంలో ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. దేశంలో ఎదురు లేని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఫామ్ హౌజ్ వ్యవహారంపై కూడా కేసీఆర్ స్పందించారు. గత నెలలో రామచంద్రబారతి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ ను తెలంగాణ హైకోర్టుకు పంపించాం. అలాగే దానికి సంబంధించిన వీడియోలను అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీ అధ్యక్షులకు పంపించాం. దేశంలో అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు ఫైల్స్ పంపుతున్నాము. ఫామ్ హౌజ్ ఫైల్స్ మూడు గంటలు ఉన్నాయి. ఇది సెకండ్ షో అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చమని వీడియోలో చెబుతున్నారు. మరో నాలుగు ప్రభుత్వాలను పడగొడతామంటున్నారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఆధార్ కార్డులు ఎక్కడివి అని కేసీఆర్ ప్రశ్నించారు.
