కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో వివోఏల వేతనాల పెంపుదల మరియు ఇన్సూరెన్స్ ఐడి కార్డ్స్ పిఆర్సి అమలు చేస్తామని ప్రకటించినందున ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రులు హరీష్ రావు కి గంగుల కమలాకర్ కి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది,ఈ సందర్భంగా వివో ఏలు కేసీఆర్ కి హరీష్ రావు కి రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివోఏల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్, మండల కార్యదర్శి వడ్లకొండ పద్మ, కోశాధికారి నల్ల శ్రీజ
వివిధ గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.