- కబ్జాదారులపై చర్య తీసుకోవాలి..
- లేదంటే రెవెన్యూ మంత్రి, డిజిపిలకు ఫిర్యాదు..
- రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడిమండలం : కబ్జాదారుల నుండి రజకుల భూమిని కాపాడాలని శుక్రవారం తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. రామంచ గ్రామంలోని రజక కులానికి చెందిన కొలిపాక రాజు, కొలిపాక కుమార్ లకు అదే గ్రామానికి చెందిన నర్ర నాగేశ్వర్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు గత ఏడాది సర్వే నెం. 260/బి, విస్తీర్ణం 0-03 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారు. అయితే ఇదే గ్రామానికి చెందిన కొంతమంది దళితులు రజకులు కొన్న భూమిలో ఖనీలు పాతుతూ కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని పూసాల సంపత్ ఆరోపించారు. దీనిపై మండల రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్ళి నిజానిర్ధారణ చేసి రజకులకు న్యాయం చేయాలని, లేనియెడల తీవ్ర ఆందోళనలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రికి అలాగే రాష్ట్ర డి.జి.పి. దృష్టికి తీసకెళుతామని పూసాల సంపత్ పేర్కొన్నారు. రజకులకు న్యాయం జరిగే వరకూ వారి వెంట ఉంటామని తెలిపారు.