contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

10న జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలి..

● గన్నేరువరం మండలం నుండి భారీ ఎత్తున సభకు తరలి రావాలి..

● బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో లక్షలాది మందితో ఈనెల 10న హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రోజున బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే ప్రధాని మోదీ సభ కోసం కార్యకర్తలకు దేశానిర్దేశం చేయడానికి, జన సమీకరణ కోసం సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలనే జిల్లా పార్టీ లనే ఆలోచనతో ఉన్నదని, ఆ దిశలోనే గన్నేరువరం మండలం నుండి అధిక సంఖ్యలో జన సమీకరణ చేయడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చే వారి కోసం రవాణా, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారనీ, 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలని కోరారు.. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలనీ, మండలంలోని ఆయా గ్రామాలు, వార్డులలో వాల్ రైటింగ్ రాయించాలని సూచించారు. ప్రధాని మోడీ సభ సక్సెస్ తో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని, రాష్ట్రవ్యాప్తంగా బిజెపి గాలి వీచే అవకాశం ఉందన్నారు. మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ మాట్లాడుతూ పదవ తేదీన హైదరాబాదులో జరిగే ప్రధాని మోడీ సభకు గన్నేరువరం మండల బిజెపి శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లడానికి సిద్ధం కావాలన్నారు. అలాగే 12 వ తేదీన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయడానికి మండల బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో బీజేపీ మండల సీనియర్ నాయకుడు బండి తిరుపతి,మచ్చ సాయికృష్ణ, సందవేణి ప్రశాంత్,మచ్చ బాలరాజు,మునిగంటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :