కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పనుల పేరుతో జరుగుతున్న అక్రమాలపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంకు చెందిన నలుగురు ఉపాధి హామీ కూలీలు… ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలతకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మక్క కంకులు ట్రాక్టర్‌లో లోడ్ చేస్తూ కనిపించారు.
గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు హాజరైన ఈ కూలీలు… ఉదయం 7 గంటలకు హాజరు నమోదు చేసిన అనంతరం, ప్రభుత్వ పనులకు బదులుగా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యక్తిగత వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పక్కా సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రిపోర్టర్ టీవీ ప్రతినిధి… కూలీలు మక్క కంకులు లోడ్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించారు. వీడియో తీస్తున్నట్లు గమనించిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం… ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలను తన సొంత వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై గన్నేరువరం మండల అధికారులు ఎలా స్పందిస్తారు… ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.








