గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లె ఎక్స్ రోడ్ నుండి గోపాల్ పూర్ గ్రామం వరకు అలాగే ఖాసీంపేట గ్రామ శివారులోని కట్టే మిషన్ నుండి పారువెళ్ల మీదిగా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామం వరకు హైబ్రిడ్ అన్యూటీ మోడ్ పథకంలో డబుల్ రోడ్డు మంజూరు కాగా పరిపాలన అనుమతులు వచ్చిన సందర్భంగా రెండు గ్రామాల్లో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ఆకుల కవిత-సంతోష్, పారువెల్ల గ్రామ సర్పంచ్ యాళ్ళ లక్ష్మీ – రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి,కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొంటి సంతోష్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జెల్ల రాజేశ్వరి,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మార్గం మల్లేశం,మాజీ సర్పంచ్ సంగు దేవయ్య, మాజీ ఎంపీటీసీ బద్దం రామ్ రెడ్డి,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, మాంకాల రాములు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ లింగంపల్లి శ్రీకాంత్, సంగు వేణు, వార్డు సభ్యులు బండిపెల్లి సంతోష్,మండల సీనియర్ నాయకులు మార్గం మల్లేశం, కళ్ళెం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.









