కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని పరిధిలోని సర్వే నంబర్లు 85/3, 86/3, 87/3లో ఏర్పాటు చేసిన ‘సంకల్పం గ్రీన్ సిటీ’ వెంచర్‌పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెంచర్ యజమాని ఆనంద్ మోడీ స్పష్టం చేశారు.
వెంచర్ ఏర్పాటు, ప్లాట్ల విక్రయాలకు సంబంధించి అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే విక్రయాలు చేపట్టామని ఆయన తెలిపారు. 13 ఎకరాల 8 గుంటల విస్తీర్ణానికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీడింగ్స్ (Proc. No: E/739/2020) పొందినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లా సర్వే కార్యాలయం ద్వారా డీమార్కేషన్, DTCP లేఅవుట్ ఆమోదం (TLP No: 365/2021/W), రేరా రిజిస్ట్రేషన్ (RERA No: P02600007287) వంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు.
నిబంధనలకు అనుగుణంగా వెంచర్‌ను అభివృద్ధి చేయడంతో ఇప్పటికే దాదాపు 80 శాతం ప్లాట్లు విక్రయించామని ఆనంద్ మోడీ తెలిపారు. చట్టబద్ధమైన అనుమతులు, అధికారిక రికార్డులను పరిశీలిస్తే వెంచర్‌కు సంబంధించిన వాస్తవాలు స్పష్టమవుతాయని అన్నారు.
కొంతమంది వ్యక్తిగత కక్షలతోనే వెంచర్‌పై తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు సంబంధిత రికార్డులు, అనుమతులను పూర్తిగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని ఆనంద్ మోడీ కోరారు.
వెంచర్‌కు సంబంధించిన అన్ని అనుమతులు, పత్రాలు అధికారుల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయని, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం అనవసరమైన ఆరోపణలకు తెరపడుతుందని ఆయన పేర్కొన్నారు.








