చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం, కాప్పల్లి-4 గ్రామమునందు సర్వే నెంబర్ 155/1 లో 58 సెంట్ల తోపు పోరంబోకు ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమిలో అప్పటి ప్రభుత్వ విజయ(BMCU) పాల డైరీ కి 31 సెంట్ల భూమి ని సర్వే నంబర్155/14 గా విభజించి రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కొత్తగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ భూమి చేంబకూరు రామసముద్రం మెయిన్ రోడ్డుకు ఉన్నందున దీని విలువ కోటి రూపాయల పైన ఉన్నది. ఇది గమనించిన భూ కబ్జాదారులు తమ పేరిట 2005వ సంవత్సరంలో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చినట్టు బోగస్ పట్టా సృష్టించి భూమితోపాటు BMCU పాల డైరీ ని కూడా కబ్జా చేసి తాళాలు వేశారు. తర్వాత కొన్నాళ్లకు ప్రభుత్వం విజయ డైరీలను అమూల్ సంస్థ వారికి అప్పజెప్పడం తో వివాదం మొదలైంది. అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి గారు స్వయంగా రంగంలోకి దిగి కబ్జాదారుల నుండి పాల డైరీ ని విడిపించి అమూల్ సంస్థకు అప్పగించారు. మిగిలిన భూమి అక్రమార్కుల కబ్జా లోనే ఉన్నది. రామసముద్రం మండల రెవెన్యూ అధికారులు కబ్జాదారుల వద్ద ఉన్నది బోగస్ పట్టా గా గుర్తించి సదరు భూమిని స్వాధీనపరచు కొనేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సదరు కబ్జాదారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన BMCUపాల డైరీ ని కూడా అది తాము నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు అని వాదించడం కొస మెరుపు. పలుమార్లు రెవెన్యూ సిబ్బంది ఈ భూమిని స్వాధీనపరచు కోవడంలో విఫలమయ్యారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుండి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.