contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

కిడ్నాప్ కు గురైన యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు జిల్లా: మంగళగిరి నియోజకవర్గ పరిధి దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు తేజ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. మహంకాళి ఆలయానికి విజయవాడ నుంచి వచ్చిన భక్తులపై కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడగా అడ్డుకున్న తేజ అనే యువకుడిని కారులో ఎక్కించుకుని పరారయ్యారు. దీంతో తేజ కుటుంబ సభ్యులు దుగ్గిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు కారు వెళ్లిన ప్రాంతాన్ని అనుసరించి విజయవాడ వైపు వెళుతున్నట్లు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తాడేపల్లి వద్ద దుండగుల కారుని పట్టుకుని యువకుడు తేజను దుండగుల చెర నుంచి పోలీసులు రక్షించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :