contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాస్టర్‌కు ఆర్థిక సహాయం

పిడుగురాళ్ల: అవసరంలో ఉన్న సేవకులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.

పల్నాడు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండల యునైటెడ్ ఫెలోషిప్ సేవకులు కె. శ్రీనివాసరావుకు రూ.2,000 ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో ఆయన ఎదుర్కొన్న శారీరక బలహీనతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఫెలోషిప్ తరఫున ఈ సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అవసరాల్లో ఉన్న సేవకులకు తమ వంతు సహకారం అందించేందుకు ఏపీఎస్‌పీఎఫ్‌ పల్నాడు జిల్లా ఫెలోషిప్ ఎల్లప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ రీజినల్ ఇన్‌చార్జి దేవదాస్‌తో పాటు స్థానిక కమిటీ సభ్యులు అమర్నాథ్, మరియదాస్ పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందుకున్న పాస్టర్ కె. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ఫెలోషిప్ సభ్యులు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అవసర సమయంలో తమకు అండగా నిలిచిన ఫెలోషిప్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :