పల్నాడు జిల్లా – మాచర్ల : మాచర్ల పట్టణంలోని పలు వార్డుల్లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా పలు వినాయక మండపాలను సందర్శించి విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండపాల్లో వినాయకుడిని దర్శించుకున్న యాగంటి మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరిపై విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు.
వినాయక ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాకుండా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ఐక్యతకు ప్రతీకలని యాగంటి పేర్కొన్నారు. మాచర్లలో భక్తి, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.
మండపాల వద్ద స్థానికులు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులతో యాగంటి మల్లికార్జునరావు ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యే నాయకుడిగా యాగంటి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో శివ, యాగంటి ప్రతాప్, మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వర్ రెడ్డి, చెన్న, బొట్టు కోటేశ్వరరావు, కృష్ణ, స్వామి, కొండలు, వెంకటేష్, శివ, శ్రీను తదితరులతో పాటు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.








