గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్నగర్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తనయుడు నిధిష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిధిష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిధిష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.
చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించడం ద్వారా నిధిష్ తన పుట్టినరోజును ఆనందంగా, సేవా కార్యక్రమంతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, కార్పొరేటర్ నెలకంటి రాము, బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.








