మెదక్ జిల్లా, తూప్రాన్ : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, ఉమా సత్య లింగం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, డాక్టర్ కల్లూరి సంతోష్, ప్రభాకర్ రెడ్డి, కిష్టారెడ్డి , షీందే చంద్రం, రఘుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పర్సా నర్సింగరావు , రాజు, శ్యామల అశోక్, కోరవోయిన ప్రవీణ్, అనిల్, రమేష్, స్థానికులు పాల్గొన్నారు