తూప్రాన్ డివిజన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని తెలిపారు . కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 15 జిల్లాలు ఉన్నాయి.
ఈ క్రమంలో కలెక్టర్లు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో ఓటర్ గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని టీచర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయగలుగుతారు.
అర్హులైన అభ్యర్థులు సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబరు మొదటి వారం నాటికి కొత్త ఓటరు జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం విధివిధానాలను జిల్లా అధికారులకు పంపించింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ తర్వాత సవరణలకు గడువు ఇచ్చి, డిసెంబర్ 30 న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఐదేళ్ల కిందట ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటు వేసిన వారంతా తిరిగి కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి తెలిపారు.
ఈ ప్రక్రియతో సంబంధించి మరింత సమాచారం కోసం స్థానిక అధికారులు లేదా సీఈఓ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.