మెట్ పల్లిలో లిక్కర్ ఏరులై పారుతోంది..ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఇండ్లమధ్యే దొరుకుతోంది. ఏ ఊరికి వెళ్లినా కనీసం నాలుగు నుంచి పది బెల్టు షాపులు కనిపిస్తున్నాయి.
కాలనీలో బెల్టుషాపుల కలకలం…
పట్టణంలో ఆయా కాలనీల్లో అక్రమంగా వెలసిన బెల్ట్ షాపులు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో బెల్టు షాపులు అశాంతిని రేపుతున్నాయి.
అందుబాటులో బెల్ట్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసవుతున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, కలతలు నిత్యకృత్యమయ్యాయి..
వీధుల్లోనే బెల్టు షాపులు మద్యాన్ని కుమ్మరిస్తున్నాయి. మద్యం కళ్ళముందే అందుబాటులోకి రావడంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిస అవుతున్నారు.
అంతేకాకుండా బెల్టు షాపు ఓనర్లు మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. రాత్రిళ్లు మద్యం విక్రయాలను అధిక ధరలకు అమ్ముతున్నారు.
ఆ సమయంలో వైన్ షాపులు మూసి ఉండడంతో ఇదే అదునుగా ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్టుషాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అంతేకాకుండా తమ ఆదాయం రెట్టింపు కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న వైన్ షాపు ఓనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్టుషాపులను అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న వైన్ షాప్లను సీజ్ చేయాలని కార్మిక కుటుంబాలు అధికారులను కోరుతున్నాయి. అంతేకాకుండా బెల్టుషాపుల దందాకు అవకాశం ఇస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అధికారులు చూసి చూడనట్టుగా ప్రధానంగా వినిపిస్తుంది.