నిజామాబాద్ / మెట్ పల్లి : నిజామాబాద్-కరీంనగర్ వెళ్లే రహదారి రోడ్డు మోకాలి లోతు గుంతలు పడింది. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులకు నరకాన్ని చూ పిస్తోంది. ప్రతిరోజూ వందలాదిమంది వాహనదారులు వెళుతుంటారు. రోడ్డుపై గుంతలు తప్పించబోయి చాలామంది ప్రమాదం బారినపడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. మీ చా వు మీరు చావండి అన్నట్లు వ్యవహరిస్తూ రోడ్డు మరమ్మ తులను పట్టించుకొనేవారే కరువయ్యారు. ప్రజలు రోడ్డు దుస్థితిని తలచుకుంటూ అధికారులు, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చారలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/భారత్-స్కౌట్స్-అండ్-గైడ్స్-ప్రారంభోత్సవ-వేడుకలు.webp)