కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా – చింతలమనేపల్లి: జూన్ 1న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపునిచ్చారు.
చింతలమనేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పర్యటన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








