తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరైనారు. ముందుగా పాకాలకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చిత్తూరు రోడ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, ఎన్.టీ.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాకాల బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే బారి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచి పెట్టి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ అంబేద్కర్ కొందరువాడు కాదని అందరివాడని రాజ్యాంగం పరంగా అందరికీ హక్కులు కల్పించారు అన్నారు. మహిళలకు హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రపంచంలోనే ఇంతవరకు అంబేద్కర్ అంతటి జ్ఞానాన్ని పొందిన మరొక వ్యక్తి లేదని చరిత్ర తెలుపుతుందన్నారు. శ్రామికులకు ఎనిమిది గంటలు పనిగంటలుగా, ఉద్యోగస్తులకు సెలవులు పరంగా తీసుకొచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ దే అన్నారు. దేశ ప్రజలు రాజ్యాంగం చదవాలని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని తన ప్రకటనలో పేర్కొన్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ అన్నారు.
