పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని మిరియాల గ్రామంలో ఎస్సి కాలనిలో నివాసముంటున్న కందుకూరు దేవా బిక్షం మనమరాలు అన్నప్రాసన కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. బేబీ ప్రనీషా గ్రేస్ కు పిన్నెళ్లి పాయసం తినిపించి దీవించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ అన్నప్రాశనం పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం. ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని తెలిపారు. పెద్దలు రాజశేఖర్ రెడ్డి, ఎర్ర గురువారెడ్డి దీవించారు.
అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ అన్నప్రాశనము చేసే సంప్రదాయం మనకెప్పటినుంచో ఉందన్నారు.
అలాగే ఈ కార్యక్రమ లో పాల్గొన్న పలువురు పెద్దలు మాట్లాడుతూ అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు. శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఒక భావన ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమ లో కాలనీ పెద్దలు కందుకూరి దేవ బిక్షం, కందుకూరు చిన్న జాను, కందుకూరి క్రీస్తు దాసు, కందుకూరి ఎలీషా, కందుకూరి చింటూ, కందుకూరి ఏలియా, రాజు పాల్గొన్నారు.
