పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రామారావు పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం సంస్కార హీనమైన చర్యని,టీడీపీ హయాంలో నిర్మించిన హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బదులు మీరు కొత్తగా నిర్మించి మీనాయకుడు పేరు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో అక్రమాలు అరాచకాలతో వైసీపీ నాయకులు చేస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని,ఇప్పటికైనా తీరు మార్చుకుని ఎన్టీఆర్ పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని,లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టి మీకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీను, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వహక కార్యదర్శి పణితి రవి,రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ శ్రీను,జిల్లా ఉపాధ్యక్షులు మేకల సాంబశివరావు,వడ్డవల్లి సర్వేశ్వరరావు,వల్లెపు రామకృష్ణ,కోట హరి,సుతారు నాగమల్లేశ్వరరావు,,ఏలూరి ప్రసన్నాంజనేయులు,కుంచెపు నాగ లింగేశ్వరరావు,పిల్లి చెన్నారావు,బొల్లాశ్రీను,బత్తుల శ్రీను,నీరుమళ్ల శ్రీను,డాక్టర్ వలి,బత్తుల వెంకటేశ్వర్లు,ఐతమ్ మాణిక్యరావు,కుంచెపు శ్రీను,మంచికల్లు శివ,బిజిలి వెంకట్రావు,జమ్మిశెట్టి రామకృష్ణ,పణితి కృష్ణ,యామిని వెంకట్రావు,దూదేకుల రాజు,తదితరులు పాల్గొన్నారు.
