కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెళ్ళ గ్రామంలో యాల్ల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లాల సుధాకర్ రెడ్డి ఐదు ఏకరాల వ్యవసాయ భూముల్లో ఆయిల్ పామ్ కు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాస్ హాజరైనారు. గ్రామంలో 36 మంది రైతులు, 90 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 150 ఎకరాల్లో సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు హార్టికల్చర్ అధికారి స్వాతి చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు గ్రామ రైతులు ముందుకు రావడం సంతోషమన్నారు. భవిష్యత్తులో గ్రామ రైతులు మండలం, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ గుడేల్లి తిరుపతి, రైతుబంధు మండల అధ్యక్షులు బద్దం తిరుపతిరెడ్డి, ఎంపిటిసి ఏలేటి స్వప్న చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అక్క రాజు ఆశాలు, ఏవో కిరణ్మయి, మండల హార్టికల్చర్ అధికారి స్వాతి, ఏఈఓ అంజలి, డ్రిప్ నిర్వాహకులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.