పల్నాడు జిల్లా , దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పంచాయితీ సెక్రెటరీ రామకోటేశ్వరావు పంచాయితీ సర్పంచ్ కి తెలియకుండా 4 లక్షల 20 వేలు నిధులు డ్రా చేసాడని గ్రామ సర్పంచ్ బొడ్డు నరసమ్మ స్ధానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సెక్రెటరీ రామకోటేశ్వరావు పంచాయితీ తీర్మానం లేకుండా , పంచాయితీ నిధులు కాజేశాడని , మేము గ్రామంలో అభివృద్ధి పనులు చేసి , M BOOK లు నమోదు చేసి నిధులు కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తుంటే సెక్రెటరీ నిధులు గోల్ మాల్ చేయడంతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. విచారణ జరిపి పంచాయితీలో సెక్రెటరీ డ్రా చేసిన నిధులను పంచాయితీలో జమ చేపించి, సెక్రెటరీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచ్ బొడ్డు నరసమ్మ కోరారు.