contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యే రెడ్డి , ఎస్పీ రెడ్డి , మహిళ పై దాడి చేసింది వైసిపి రెడ్డి … ఇక న్యాయం జరిగిద్దా ?

  • హోమ్ గార్డ్ కుమార్తె పై రెడ్డి దాడి
  • సాక్షాధారాలు మాయం చేసిన డిఎస్పీ జయరాం ప్రసాద్
  • కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్న ఎస్పీ రవి శంకర్ రెడ్డి
  • ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
  • ఎస్పీ రవి శంకర్ రెడ్డి
  • మహిళ పై దాడి చేసింది వైసిపి శ్రీనివాస్ రెడ్డి
  • ఎస్టీ ఎరుకల మహిళకు న్యాయం జరుగుతుందా ?
  • ఎస్సి ఎస్టీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేతున్న పోలీసులు

పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామము లో దారుణం చోటుచేసుకుంది. నరసరావుపేట శ్రీ గాయత్రీ ఎలెక్ట్రికల్స్ యజమాని శ్రీనివాస్ రెడ్డి, నవీన అనే ఎస్టీ ఎరుకల వివాహిత పై దాడి ఘటన సంచలనాన్ని రేకెత్తిస్తుంది.

వివరాల్లోకి వెళితే మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన సింగయ్య , లక్మి ల కుమార్తె నవీన కు నరసరావుపేట కు చెందిన ఉయ్యాల తిలక్ అనే వ్యక్తికీ వివాహం జరిగి సుమారు అయిదు సంత్సరాలు కావస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల వలన ఈ సంత్సరం మే నెల ఐదవ తారీఖు అనగా 5 – 5 2022 న నవీన భర్త తిలక్ , శ్రీ గాయత్రీ ఎలెక్ట్రికల్ షాప్ యాజాని వైసిపి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి .. నవీన ని తన తల్లిగారి ఇంటికి అనగా పిల్లుట్ల గ్రామానికి తీసుకెళ్లి వదిలిపెట్టి నా ఫ్రెండ్ కట్టిన తాళి ఎందుకె నీకు అంటూ దుర్భాషలాడి తాళి గుంజి నవీనపై దారుణంగా దాడి చేసాడు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలో ఉన్న డిఎస్పీ జయరాం ప్రసాద్ విచారణ చేప్పట్టి, సాక్షాలు సేకరించి .. సాక్షాలు ఎక్కడో మిస్ అయ్యాయంటూ కేసును నీకుగార్చే ప్రయత్నం చేసినట్టు బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి కి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. శ్రీనివాస్ రెడ్డి కి వైసిపి రాజకీయ అండదండలు ఉండడం తో ఎస్పీ రవి శంకర్ రెడ్డి కూడా భయపడి కేసులోని సాక్షులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయ్నత్మ చేసినట్టు బాధితురాలు చెప్తుంది. ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒక డిఎస్పీ స్థాయి అధికారి అది కూడా పట్టపగలు వెళ్లి విచారణ చేయాలి. కానీ నిన్న రాత్రి ఎస్సై మరికొంతమంది పోలీసులు వెళ్లి సాక్షులను బెదిరించి సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.

అసలు ఎవరి శ్రీనివాస్ రెడ్డి ! ఎందుకింత హడావుడి చేస్తుంది పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగ … ఎమ్మెల్యే కూడా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని శ్రీనివాస్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :