పార్వతీపురం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ధర్మపక్షం ఆఫీసులో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చుక్క భాస్కరరావు మాట్లాడుతూ, “దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిర్వాకం చేస్తున్నారని, రాజ్యాంగం కల్పించే హక్కులను కాలరాస్తున్నారని” తీవ్రంగా విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటి పౌరహక్కులకు విఘాతం కలుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా రాజ్యాంగ పరిరక్షణకు, మత సామరస్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మపక్షం కోశాధికారి ఎమ్. ఈశ్వరరావు, ఉప కార్యదర్శి జి. శ్రీరామచంద్రమూర్తి, సభ్యులు వి. శ్రీహరి, శివ తదితరులు పాల్గొన్నారు