ఒంగోలు: హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేత నుండి సగర్వంగా సభ్య సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలని ఎస్పీ హిజ్రాలకు ఉద్బోధించారు. కొందరు హిజ్రాలు చేస్తున్న, బలవంతపు వసూళ్లు, అసాంఘిక కార్యకలాపాలు వలన, సభ్య సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తున్నారని, అటువంటి పనులను మానుకుంటే, హిజ్రాలు కూడా సభ్య సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతారని ఎస్పీ వారికి హితబోధ చేశారు.
హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యను కల్పించడం, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలలో బలవంతపు వసూళ్లకు పాల్పడడం, బిక్షాటన పేరుతో అశ్లీలమైన దుస్తులను తొలగించడం వంటి పనుల వలన హిజ్రాల ఆత్మగౌరం దెబ్బతింటున్నదని ఎస్పి పేర్కొన్నారు.
వారు ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలను మానుకుని వృత్తులను, ప్రత్యామ్నాయ జీవన ఉపాధి మార్గాలను అన్వేషించాలని హితబోధ చేశారు. హిజ్రాల సంస్కరణ కోసం ఒకవైపు చర్యలు తీసుకుంటూనే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విభాగం కలిగించే పనులను సహించబోమని హెచ్చరించారు. హిజ్రాల జీవన ప్రమాణాలు పెంచడానికి, ప్రభుత్వ పథకాలు రాయతీలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వ శాఖలతో మరియు సంబంధిత శాఖ మంత్రి డోల బాలవీర ఆంజనేయులు కూడా హిజ్రాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం తరుపున తెలియచేసారు. అందులో 1)రేషన్,2) పెన్షన్, 3) డ్వాక్రా గ్రూపులు, 4)చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనటానికి లోన్లు
ఒక జిల్లాస్థాయి పోలీస్ అధికారి తమను అమ్మ అని సగర్వంగా పలకరించడం, తమ సమస్యలను సానుకూలంగా విని, పరిష్కార మార్గాలు సూచించడం తమ జీవితాలలో ఇదే మొట్టమొదటిసారి అని తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ సూచనల మేరకు తాము ఈరోజు నుంచి పరివర్తన చెంది, లైంగిక, అసాంఘిక కార్యకలాపాలు మానుకుంటామని, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు వైపు అడుగులు వేస్తామని హిజ్రాలు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ చంద్ర శేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి మరియు ఎస్సైలు పాల్గొన్నారు.