contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలుగు మీడియా ప్ర‌పంచానికి ఆయ‌న‌ ఓ దార్శనికుడు : వి.సుధాకర్ – జాతీయ అధ్యక్షులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా

తెలుగు పాత్రికేయ రంగానికి కొత్త ఒరవడి దిద్దిన అక్షర యోధుడు రామోజీరావు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్, జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ స్పందించారు.

తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ ఒక విడదీయలేని భాగం అని అభివర్ణించారు. “ఈనాడు గ్రూప్‌, ఈటీవీ నెట్‌వర్క్‌, ఫిల్మ్‌ సిటీ వ్యవస్థాపకులు, కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన ఓ దార్శనికుడు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన సిసలైన యోధుడు రామోజీరావు అని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :