తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం పెరుమాలపల్లి పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై (MGNREGS) గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఒక్కొక్కరుగా గ్రామసభను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు గతంలో ఎన్నడు లేని విధంగా పంచాయతీల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్రమంతట ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని అందరి సలహాలు సూచనలతో పంచాయితీ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలిపినట్లు నాని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి భాగాలుగా విభజించినట్లు… ప్రతి పంచాయతీలలో సైడు కాలువలు, డ్రైనేజీలు వంటి పనులు ప్రారంభించాలని, రోడ్లు వంతెనలు పనులు ప్రారంభించి మూడు సంవత్సరాలలో పనులు పూర్తి చేయాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని, గతంలో జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి పేదల ఇల్లులు అన్యాయంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని పేదల పిల్లలు వారికి అప్పగించాలని విటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. పెరుమాలపల్లి పంచాయతీ నాయకులు, ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంను టిటిడి కి అనుసంధానం చేయాలని కోరారు. వారి కోరిక మేరకు టీటీడీ వారితో మాట్లాడి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో టిటిడి అనుసంధానం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.