contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

రాజపూర్ ఎస్ఐ శ్రీనివాస్ సస్పెండ్

పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడని సస్పెండ్ చేసిన ఎస్పీ

రాజపూర్ ఎస్ఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ.. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

బుధవారం తెల్లవారుజామున తాను నివాసం ఉంటున్న జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మధ్యం మత్తులో ఇతరుల ఇంటికి వెళ్లి తలుపులు కొట్టడంతో స్థానికులు చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

దీంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. రాజాపూర్ ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించాడని భావించి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

 

వివరణ : తాగిన మత్తులో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లబోయి, పక్కింటి తలుపు తట్టి లోనికి వెళ్లాడు..అంతే అతడిని పట్టుకుని చితకబాది చెట్టుకట్టేశారు స్తానికులు..ఆ తర్వాత అతడు ఎవరో తెలిసి షాక్‌కి గురైయ్యారు. ఎందుకంటే వాళ్లు చెట్టుకు కట్టేసింది ఓ ఎస్సైని కనుక. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది..

జిల్లాలోని రాజాపూర్ మండల పోలీస్‌స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. మద్యం మత్తులో ఆయన తన ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్లాడు. అయితే శ్రీనివాస్‌ సాధారణ దుస్తుల్లో ఉండటంతో వచ్చింది ఎస్సై అని తెలియక చితకబాది చెట్టుకు కట్టేశారు స్తానికులు. ఇదంతా జరిగాక ఆ వచ్చింది ఎస్సై అని తెలిసింది. అయితే ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరి అంత సోయి లేకుండా తాగిన ఎస్సైని నెటిజన్స్ కామెంట్స్‌తో వాయగొడతున్నారు. ఎస్సై గారిని ఆయన పని చేస్తున్న స్టేషన్‌ సెల్‌లో వేయాలని అని ఒకరు పేర్కొనగా.. మందు ఫ్రీగా వచ్చినట్టుంది అందుకే సారు గారు పీకలదాకా తాగారు అని మరొకరు రాసుకొచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :