contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్సీ మైనర్ బాలిక పై అత్యాచారం – పట్టించుకోని అధికారులు

పల్నాడు జిల్లా రెంటచింతల :  3 నెలల క్రితం మాచర్ల ఏడవ మైలు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎస్సీ మైనర్ బాలిక (15) పై అత్యాచారం జరిపిన యుద్దనపూడి శ్రీనివాసరావు యొక్క కుల ధ్రువీకరణ మరియు స్థానికత  వంశావళి పై సమగ్ర విచారణ చేపట్టి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  భృణ హత్య నేరము కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పిడుగురాళ్ల ఎమ్మార్వో ఆఫీసు నందు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో  మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎం సి పి ఐ. రాష్ట్ర నాయకులు పి అబ్రహం లింకన్ మాట్లాడుతూ మాచర్ల పట్టణం 20వ వార్డు ఎరుకల కాలనీకి చెందిన పోలేపల్లి రెబ్బమ్మ W/O అంజి వారి 15 సంవత్సరాల కుమార్తె మాచర్ల సాగర్ రోడ్ లోని ఏడో మైలు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నందు 10వ తరగతి చదువుతుండగా స్థానిక పాఠశాల టీచర్గా ఉన్న యుద్దనుపూడి శ్రీనివాసరావు మైనర్ బాలికను బెదిరించి అనేకమార్లు లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లడంతో తల్లిదండ్రులు 03/10)2022 నా మాచర్ల పోలీస్ వారిని సంప్రదించగా పోలీసు వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి నాలుగు రోజుల తర్వాత యుద్దనపూడి శ్రీనివాసరావును మైనర్ బాలికను తీసుకొని వచ్చి అతనిపై CR no 153/2022 ఫోక్సో కేసు నమోదు చేశామని తెలుపుతూ బాలికను వైద్యపరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు దీనికిగాను ముద్దాయి యుద్దనపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం బెయిల్ తో జైలు నుండి తిరిగివచ్చి కేసును వెనక్కు తీసుకోవాలని గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ఆ కుటుంబాన్ని చిత్రవధ చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారు అసలు ముద్దాయి పూర్తి వివరాలను పరిశీలిస్తే యుద్దనపూడి శ్రీనివాసరావు BC.D ముదిరాజు కులము కాగా 1991 వ సంవత్సరము I T D A లో అడిషనల్ ఉపాధ్యాయుడిగా తప్పుడు కుల ధ్రువీకరణ SC ST చెంచు పేరుతో ఉద్యోగం సంపాదించాడు నేటికీ తన యొక్క SR నందు కులము నమోదు చేసి ఉండలేదు దీనిపై మాచర్ల పోలీస్ స్టేషన్లో మొదట ఫోక్సో కేసులో నమోదు చేసినప్పటి నుండి మాచర్ల సిఐ , గురిజాల డిఎస్పి, (కుప్పన బోయిన) శ్రీనివాసరావు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బృణ హత్యా నేరము కేసు నమోదు చేయాలని అనేకమార్లు తెలిపిన కుల ధ్రువీకరణ మా పరిధిలో లేదు రెవిన్యూ వారి బాధ్యత అని అనడంతో తరువాత కలెక్టర్  స్పందన కార్యక్రమంలో మూడుసార్లు అర్జీ ఇచ్చి ఉన్నారు ఈ విషయమై జాయింట్ కలెక్టర్  విచారణ చేపడుతూ 25/02/2023 న పిడుగురాళ్ల మండల ఎమ్మార్వో కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ మైనర్ బాలిక 15 పై హత్యాచారము జరిపి భ్రోణ హత్య చేసిన కుప్పన బోయిన శ్రీనివాసరావు (55) ముదిరాజులు బిసి. డి పై ఎస్సీ ఎస్టీ కేసు, బ్రోన హత్యా నేరము కేసు నమోదుచేసి బాధిత కుటుంబానికి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఎం సి పి ఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ, సి పి ఐ కృష్ణా నాయక్ ,సిపిఎం బుంగ నాగేశ్వరరావు ,సిపిఎం బత్తుల వెంకటేశ్వర్లు ,ఆర్ టి ఐ కుమార్ ,దళిత నాయకులు డేగల అబ్రహం ,ఎం ఆర్ పి ఎస్ ఇశ్రాయేలు ,నాగేశ్వరరావు వైసీపీ సంతోషరావు, మహిళా సమైక్య సభ్యులు పి సుజాత ,కోటేశ్వరమ్మ,మరియమ్మ,దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :