- అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం
- సుమారు 4 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయిన అడితి యజమాని నూతలపాటి వెంకటేశ్వర్లు
పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్ని గండ్ల గ్రామ శివారులో గల సినిమా హాల్ సెంటర్ మెయిన్ రోడ్ లో ఉన్న నూతలపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సంబంధించిన కట్టెల అడితిలో అర్ధరాత్రి దాటాక సుమారు 3 గంటలు రెండు నుంచి మూడు గంటల మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్న డంతో అదే ప్రాంతంలో నైట్ బీట్ (విధులు) నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పఠాన్ యాసిన్. కానిస్టేబుల్ షేక్ కరిముల్లా. షేక్ జాని కరిముల్లా. హోంగార్డు ఖాదర్ సకాలంలో స్పందించి వెంటనే ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించి సకాలంలో మంటల్ని అదుపులో కి తీసుకొచ్చారు.