మత సామరస్యం , కుల మతాల ఐకమత్యం గురించి మనం ఎన్నో పుస్తకాలలో చదివాము, ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలలో విన్నాం. కానీ ఆచరణలో చూపించేవారు చాలా అరుదు. ఈరోజు మీకు చూపించబోయే మండపం కొన్ని తరాలవారికి స్ఫూర్తిదాయకం. వినాయకచవితి అంటే హిందువులకు చాల పవిత్రమై పండుగ. ప్రతి ఇంట్లో , సంస్థలో , గల్లీల్లో గణపయ్యను పూజిస్తారు భక్తులు మరి ఆ భాద్యత ఒక ముస్లిం యువకుడు తీసుకుంటే అది కూడా హైదరాబాదు లాంటి సిటీలో .. ఒకటి కాదు రెండు కాదు సుమారు 20 ఏళ్ళ నుండి గణేశుడి సేవలో ఉంటూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. చిన్నతరంలో గణేశుని వల్ల జరిగిన మంచి వల్ల .. ఆనాటి నుండి తన హిందూ మిత్రులతో కలిసి గణేశునికి సేవ చేస్తున్నడు… మొహమ్మద్ సిద్దిఖ్ హైదరాబాద్ రామ్ నగర్ లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సిద్దిఖ్ భాయ్ అని పిలుస్తారు. ఆయన స్థాపించిన గణేష్ మండపాన్ని చూద్దాం ….