కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ మండలం గన్నారంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల మరియు MJP బాలికల గురుకుల పాఠశాలలో ఈరోజు సహపంక్తి భోజనాల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచడం అభినందనీయమని, విద్యార్థులు మంచి ఆహారం తీసుకుని చదువులపై శ్రద్ధ పెట్టాలని పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే శరణ్యమని. గురుకుల పాఠశాల అభివృద్ధి మరియు అసంపూర్తి భవనాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు