contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి: టీడీపీ మహిళ నేత పులివర్తి సుధారెడ్డి డిమాండ్

తిరుపతి: ఓటరు జాబితాను పారదర్శకంగా చేపటాలనీ టీడీపీ మహిళ నేత పులివర్తి సుధారెడ్డి ఎన్నికల అధికారులకు సూచించారు.అలాగే జరిగే ప్రతి అఖిల పక్షం సమావేశానికి ఎం.ఆర్.వోలంతా హాజరు కావాలని ఆమె డిమాండ్ చేశారు.మంగళవారం తిరుపతిలోని ఆర్.డి.వో కార్యాలయంలో జరిగిన అఖిల పక్షం సమావేశంలో సుధారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, ఓటరు జాబితానుపారదర్శకంగా నిర్వహించాలనే పలు అంశాలను ఎన్నికల అధికారికి వివరించారు. తమకు నోటిమాట కాదనీ …. ఏ విషయమైనా అధికారికంగా ఇవ్వాలని కోరారు. ఇక బి.ఎల్.ఓ లు ఓటరు వెరిఫికేషన్కు సక్రమంగా రావడ లేదని ఫిర్యాదు చేశారు.ఈ విషయానికి సంబంధించి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా..,సరైన స్పందన లేక పోవడం విచారకరమన్నారు. బి.ఎల్.ఓ లు రాకపోయినా.., వచ్చారని ఎం.ఆర్.ఓ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పారదర్శక ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తిరుపతి రూరల్ లోనే అత్యధికంగా ఓట్లు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందనీ చెప్పిన సుధారెడ్డి..,. ప్రతి గ్రామంలోని అధికార పార్టీ నాయకులు బి ఎల్ ఓ లను బెదిరించడం బాధాకరమన్నారు. ఎం.ఆర్.ఓ స్పందించడం లేదనీ ఆర్డీఓకు పిర్యాదు చేసారు. మండలస్తాయిలో బి ఎల్ ఓ లకు బి ఎల్ ఏ లకు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరామనీ.., ఇప్పటి వరకు సమావేశాన్ని ఏర్పాటు చేయక పోవడం అన్యాయమన్నారు. ఇంటి నెంబరు “o” వెరిఫికేషన్లో దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని దొంగ ఓట్లు.., చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్లే ఈ అవస్థలని చెప్పిన సుధారెడ్డి.,సాయినగర్ , తిరుచానూరు పంచాయతీలలో బి ఎల్ ఓ లు సహకరించడం లేదన్నారు. ఒక్కో ఇంటి నెంబర్తో పదుల సంఖ్యలో ఓట్లు ఎలా సాధ్యపడుతుందనీ ఒక్కింత ఆశ్చర్యాన్ని వెలబుచ్చారు.మంగళంలో మూడు పంచాయతీలలో ఓకే ఇంటి నెంబరుతో ఓటర్లు ఉన్నా..,ఎన్నికల అధికారులు పట్టీపట్టనట్లు వ్వవహరించడం శోచనీయమన్నారు. ఎలక్షన్ కమిషన్కి.. అధికారులు తప్పుడు సమాచారం పంపుతున్నారనీ ఆమె ఆరోపించారు.ఈ ఓటర్ల జాబితాలో ప్రభుత్వ అధికారులు , అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కై దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారనీ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎం.ఆర్.ఓ లు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదమన్నారు. నియోజకవర్గం లోని 388 బూతులలో అవక తవకలు గూర్చి అధికారులకు తెలియజేయగా..,ఇందుకు సంబంధించి స్పందించిన అధికారులు.. త్వరితగతిన సవరణ చేపడతామని సుధారెడ్డికి తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :