రేపు అంత్యక్రియలను నిర్వహించాలని తొలుత భావించిన కుటుంబ సభ్యులు.
రేపు అష్టమి కావడంతో ఎల్లుండికి వాయిదా.
పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి రేపే అంత్యక్రియలను నిర్వహించాలని అనుకున్నప్పటికీ. రేపు అష్టమి కావడంలో ఎల్లుండి నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ లోని పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఈరోజు, రేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సూపర్ స్టార్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం నుంచి ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.