ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు.
ప్రభావతి పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. ముందస్తు బెయిల్ పై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. అయితే విచారణకు సహకరించాలని ప్రభావతిని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.