రాయచోటి టౌన్: శుక్రవారం భాను హరి రెసిడెన్సి నందు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మదనపల్లి నియోజకవర్గానికి చెందిన బైగారి భారతి నాయుడుని టిడిపి బీసీ సాధికారసమితి పాల ఏకరి రాజంపేట అధికార ప్రతినిధిగా మరియు స్పోక్ పర్సన్ గా రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గం అధికార ప్రతినిధి ఫోక్ పర్సన్ గా ఎంపికైన బై గారి భారతి నాయుడు ని టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అధికార ప్రతినిధి స్పోక్ పర్సన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడుకు నా ఎంపికకు సహకరించిన పాల ఏకరి కులస్తులకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్పోక్ పర్సన్ మాట్లాడుతూ కుల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బై గారి రాజా నాయుడు, బై గారి జగన్నాథ నాయుడు, బై గారి సుబ్బారెడ్డి, పుల్లూరి రవి నాయుడు, ముద్దుశెట్టి రామయ్య తదితరులు పాల్గొన్నారు.