అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఏపీకి చెందిన బుచ్చిబాబు ప్రమాదవశాత్తు మరణించారు. బుచ్చిబాబు వయసు 40 సంవత్సరాలు. బుచ్చిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామం. కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బుచ్చిబాబు వారాంతం సెలవుల్లో కుటుంబంతో కలిసి బీచ్ కు వెళ్లారు. అయితే అలల తీవ్రత కారణంగా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
బుచ్చిబాబు మృతితో అతడి కుటుంబం తల్లడిల్లుతోంది. బుచ్చిబాబు తల్లిదండ్రులు గుండెకోతతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వగ్రామం ముండ్లమూరు గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, బుచ్చిబాబు మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు విదేశాల్లో మరణిస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.