కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో టాటా ఏసీ వాహనం దగ్ధమైంది. గన్నేరువరం గ్రామానికి చెందిన గూడూరి గౌతమ్ తన వాహనాన్ని ఇంటి ఆరు బయట పెట్టాడు. ఆవాహనం మంటల్లో దగ్ధం అవుతుండగా స్థానికులు చూసి వాహనాదారునికి సమాచారం అందించారు. వారు వెంటనే మంటల్ని నీళ్లు చల్లి ఆర్పి వేశారు. కాగా ఈ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారా అనేది తెలియాల్సి ఉంది, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
