ఉత్తరాఖండ్ యమునోత్రి ఆలయానికి దారితీసే ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. రక్షణ గోడ కూలిపోవడంతో ఆ మార్గంలో వాహనాలు ప్రయాణించడానికి వీల్లేకుండా పోయింది. సుమారు 10వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గోడ కూలిపోవడం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆ మార్గంలో నిలిచిపోయాయి.
ఇప్పటికిప్పుడు సదరు రహదారి మార్గం అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం మూడు రోజులు అయినా పట్టొచ్చని అధికార వర్గాలు చెబుతున్న అనధికార సమాచారం. చిన్న వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని అక్కడి నుంచి తరలించే చర్యలను అధికారులు మొదలు పెట్టారు. అయితే, దూర ప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారు.. వాటిని విడిచి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి.