పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో రాజకీయ దుమారం రేగుతుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వాట్సాప్ గ్రూప్ వివాదం చిలికి చిలికి గాలివానైంది. వివరాలు చూసినట్లయితే. జనసేన పార్టీకి చెందిన రమేష్ అనే వ్యక్తి కి స్థానిక రిపోర్టర్ ఏడుకొండల కి మధ్య ముదిరిన వ్యక్తిగత వివాదాన్ని జనసేన పార్టీ కి చెందిన రమేష్ రాజకీయ రంగు పులిమి … పిడుగురాళ్ళ సిఐ వెంకట్రావుని అండగా చేసుకొని అరెస్ట్ చేయించి అతని పై దాడికి యత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకు ఒక ఎస్సై , నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు సహకరించినట్టు కాల్ రికార్డు లో తేటతెల్లమవుతుంది.
అసలు ఎవరీ కొండా ? గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో సంచలనాత్మకమైన కథనాలు ప్రచురించడం వలన తనపై హత్యాయత్నం జరిగిన సంగతి స్థానిక కూటమి నాయకులు తెలుసు. అయినా కానీ రిపోర్టర్ పై వైసిపి ముద్ర వేసి రిపోర్టర్ ని అరెస్ట్ పేరుతొ కిడ్నాప్ చేసి రిపోర్టర్ ని ఏమి చేయాలనుకున్నారు అనే విషయం పై జిల్లా ఎస్పీ దర్యాప్తు జరపాలి.
జనసే పార్టీ కి చెందిన రమేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కొందరికి తొత్తుగా మారి కూటమి ఉనికిని దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగమే రిపోర్టర్ పై ఆరోపణలు అనే విషయం కూటమి నాయకులు గమనించాలి. ఈ కుట్రలో బలిపశువుగా మారింది ఒక రిపోర్టర్.
జనసేన పార్టీకి చెందిన గల్లీ కార్యకర్త కి ఆలోచన లేకపోవచ్చు కానీ కూటమిలో ఉన్న ముఖ్య నాయకులు చొరవతీసుకుని ఇంటి సమస్యని ఇంట్లో సర్దుబాటుచేసుకోకుండా గత వారం నుండి జరుగుతున్న వివాదాన్ని సినిమా చూసినట్టు చూస్తున్నారే తప్ప స్పందన లేదు. కూటమి నాయకుల అలసత్వం వలన పార్టీ కి చెడ్డ పేరు వస్తుందని గమనించలేక పోతున్నారు.
ఇకనైనా కూటమి నాయకులు స్పందించి సరైన నిర్ణయం తీసుకొని వారి పార్టీ మనుగడకి కాపాడుకోవాలి.









