తూప్రాన్ డివిజన్, డిసెంబర్ : వినియోగదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలన్న లక్ష్యంతో తూప్రాన్ HDFC బ్యాంకు బ్రాంచ్‌లో బంగారం రుణాల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్టు బ్యాంకు ఏరియా మేనేజర్ నితిన్ రాజు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తూప్రాన్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రుణ సేవలను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
బ్యాంకు అందిస్తున్న రుణ వివరాలను వెల్లడిస్తూ, 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాముపై ₹8,400 వరకు రుణం మంజూరు చేయనున్నట్లు నితిన్ రాజు పేర్కొన్నారు. కస్టమర్లకు త్వరితగతిన రుణం అందించడమే ఈ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ విజయ్ కుమార్, సేల్స్ మేనేజర్ ప్రసాద్, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ పవన్, బ్రాంచ్ సేల్స్ మేనేజర్ మల్లేష్, క్యాషియర్ హాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.









