కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా | కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఈ నెల జనవరి 20న తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆధ్వర్యంలో ‘చలో ఇందిరాపార్క్ – పోరు దీక్ష’కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆశించిన కళాకారులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష’కు మద్దతుగా ఈ పోస్టర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డోంగ్రి సంతోష్, జిల్లా అధ్యక్షులు మేడి కార్తీక్, రంటెంకి ప్రభాకర్, దుర్గం సమ్మక్క, కొమురం పవన్ మహర్షి, దుర్గం రాకేశ్ తదితరులు పాల్గొని కళాకారులకు సంఘీభావం తెలిపారు.










