కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలను శనివారం జబర్దస్త్ టీం వెంకీ మంకీ దర్శించుకున్నారు..
ఆదివారం జరగనున్న సమ్మక్క సారలమ్మ సాంగ్ షూటింగును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..ఈ చిత్రకరణలో లాస్య ప్రియా, అమృత్ మాస్టర్, సన్నీ పిఓపి, అశోక్ బోలే, నటిస్తున్నారు.
వెంకీ మంకీ మాట్లాడుతూ గన్నేరువరం సమ్మక్క సారలమ్మ ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సార్లమ్మ గద్దెల ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని తెలుసుకొని ఇక్కడ సమ్మక్క సారలమ్మ సాంగ్ షూటింగ్ ను చిత్రకరిస్తున్నట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ బోయిని పోశయ్య, కోశాధికారి బుర్ర అంజయ్య గౌడ్, మాజీ కమిటీ చైర్మన్ దేశరాజు కనకయ్య, బుర్ర మల్లయ్య, గౌడ్, మూవీ యాక్టర్ బుర్ర రాజ్ కోటి గౌడ్, బుర్ర కొటేశ్వర్ గౌడ్,బుర్ర నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.









