కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి నూతన చైర్మన్‌గా షాహీన్ సుల్తానా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరై, నూతన చైర్మన్‌కు శాలువాతో సత్కరించారు. పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరి లక్ష్యం పట్టణ అభివృద్ధి మాత్రమే ఉండాలని ఎమ్మెల్సీ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, నూతన పాలక వర్గానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ ను పూరపాలక సిబ్బంది శాలువాతో సన్మానించారు.









