contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:  బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ ఆత్మకు ప్రతీక అని, యువత వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో మొదటి నావికా దళాన్ని ఏర్పాటు చేసి శత్రు దుర్భేద్యమైన రాజ్యాన్ని స్థాపించారని, విదేశీ దండయాత్రల నుండి భారతదేశాన్ని కాపాడుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎల్ములే మల్లయ్య, బారే గూడ సర్పంచ్ తేలి బాపు, డుబ్బుల జనార్ధన్, డబ్బుల నారాయణ, రంగయ్య, ఎర్రయ్య, శంకరయ్య, కోల కిష్టయ్య, గూడ రాకేష్, పోరుతేటి వెంకటాచలం, ఎలుకరి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :