contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాతూరి స్వప్నశ్రీ కి .. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

మాసాయిపేట/తూప్రాన్ డివిజన్‌కు చెందిన డాక్టర్ పాతూరి స్వప్నశ్రీ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకుని ప్రాంతానికి గౌరవం తీసుకువచ్చారు. ఆమె చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తించి జాతీయ స్థాయి “గురుదేవోభవ సేవ పురస్కారాలు ట్రస్ట్” ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేసింది.

ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం Andhra University, విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో గురుదేవోభవ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ మాజీ మంత్రి, గ్రంథ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విశ్వ హిందీ పరిషత్ కేంద్ర హిందీ సలహాదారు Yarlagadda Lakshmi Prasad చేతుల మీదుగా డాక్టర్ స్వప్నశ్రీ ఈ అవార్డును స్వీకరించారు.

డాక్టర్ పాతూరి స్వప్నశ్రీ విద్యారంగంతో పాటు సేవా రంగంలోనూ విశేష కృషి చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథ శరణాలయాలకు విరాళాలు అందించడం, దుర్వినియోగానికి గురైన బాలికలకు చేయూతనివ్వడం, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కూడా ఆమె చురుకుగా పనిచేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ, “భగవంతుని హుండీలో వేసే దక్షిణలకు బదులుగా, నా వద్ద ఉన్నదానితో చేసే ఈ కొద్ది సేవ ద్వారా నా పిల్లలపై ఆ భగవంతుని కరుణ ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. తన కుమారునికి జరిగిన ప్రమాదం తనను మరింతగా సేవా కార్యక్రమాల వైపు మళ్లించిందని తెలిపారు. మంచి కార్యం చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఈ అవార్డు తనకు మరింత చురుకుగా పనిచేసేలా ప్రేరణనిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రాంత ప్రజలు, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :