గంజాయి అక్రమ రవాణా కేసులో విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఎంపీటీసీ నగేశ్ బాబును జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదై ఉంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో 220 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటనలో నగేశ్ బాబు ఏ-8 నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఆ ఘటన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉండగా, ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగేశ్ బాబు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడికి అనుచరుడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
పోలీసులు నగేశ్ బాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ అరెస్ట్‌తో గంజాయి రవాణా కేసులో కీలక మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.








