contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పెమ్మసాని 18 రోజులు సినిమా చూపించాడు.. పారిపొమ్మని సీఐ చెప్పాడు: అంబటి రాంబాబు

రాజమండ్రి: మూడు వేర్వేరు కేసులకు సంబంధించి 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. జైలు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

“24 గంటల్లో సినిమా చూపిస్తానన్నావ్… 18 రోజులు సినిమా చూపించావు. ఇందులో ఎవరు హీరో? నేనే హీరో. మీరు విలన్లు అయ్యారు” అంటూ వ్యాఖ్యానించారు.

అంబటి చేసిన ముఖ్య వ్యాఖ్యలు

  • గత ఇరవై రోజులుగా ఎన్నో సంఘటనలు జరిగాయని, ప్రజలు ఏం జరిగిందో అర్థం చేసుకున్నారని అన్నారు.

  • జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారని, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యానన్నారు.

  • ఈ 18 రోజుల్లో మాట్లాడే అవకాశం రాలేదని, తన కుమార్తె అన్ని విషయాలను ప్రజలకు వివరించిందన్నారు.

  • టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లి అది సరైన పద్ధతి కాదని చెప్పానని, తాను ఫ్లెక్సీ చించలేదని స్పష్టం చేశారు.

  • పార్టీ సూచన మేరకు పూజలు చేయడానికి అనుమతి తీసుకుని వెళ్లానన్నారు.

తిరిగి వస్తుండగా తన కారును అడ్డుకుని దూషించారని, ఆ తర్వాతే తాను కూడా స్పందించానన్నారు. అయితే ఇంటికి వెళ్లాక తన మాటలపై పశ్చాత్తాపం కలిగిందని చెప్పారు.

ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

సాయంత్రం తన నివాసం వద్దకు వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారని తెలిపారు. ఏడు గంటల పాటు టీడీపీ కార్యకర్తలు రచ్చ చేశారని ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను ఇంటి వద్దకు రానివ్వలేదని అన్నారు.

సీఐ గంగా వెంకటేశ్వర్లు తనకు పారిపోవాలని సూచించారని, “పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలు” అని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. స్టేషన్‌లో తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ, దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

కుల రాజకీయాలపై వ్యాఖ్యలు

నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో తాను కులవివక్ష వ్యాఖ్యలు చేశానని రాశారని, అది అసత్యమని అంబటి పేర్కొన్నారు. “నేను కమ్మ వ్యతిరేకిని కాదు. కులాల పేరుతో రెచ్చగొడుతున్నది మీరే” అని అన్నారు.

అలాగే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

“పెమ్మసాని చంద్రశేఖర్ మూల్యం చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది” అని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపై ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :