కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు పై సిపిఐ నాయకులు గన్నేరువరం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయిల్ రెండు దేశాలు ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల సహాయ కార్యదర్శులు పిప్పల కనుకయ్య, కూన మల్లయ్య, గన్నేరువరం గ్రామ శాఖ కార్యదర్శి బొమ్మకంటి అంజయ్య చారి, మండల నాయకులు ఎండీ నయ్యిం, రాపోలు రాజమల్లు, చొక్కాల శ్రీనివాస్, సామ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








